Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందూ మతం ముసుగులో మనువాదం అమలు
- బీజేపీ పాలనలో రాజ్యాంగానికే ప్రమాదం
- వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర, సామాజిక శక్తులు మోడీ సర్కారును ప్రతిఘటించాలి: నవతెలంగాణతో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ
ఒకే దేశం ఒకే పన్ను, ఒకే దేశం ఒకే భాష, ఒకే దేశం ఒకే మతం అంటున్నారు తప్ప ఒకే దేశం ఒకే కులం అని ఎందుకనడం లేదు. బీజేపీ హిందూ మతం ముసుగులో మనువాదాన్ని అమలు చేస్తున్నది.దేశంలోని కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, సామాజిక శక్తులైన ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలు, మహిళలతోపాటు అగ్రవర్ణాల్లోని కమ్మ, రెడ్డి, వెలమలకు సైతం బీజేపీ వ్యతిరేకం.వారు అధికారంలో ఉండొద్దనీ, చదువుకోవద్దనీ, మహిళలు ఇంటికే పరిమితం కావాలనీ ఆర్ఎస్ఎస్, మనువాదం చెప్తుంది.ఈ అంశాలను ప్రజలకు, సామాజిక శక్తులకు వివరిస్తాం. అయితే వాటి పట్ల వ్యతిరేకత రాకుండా ఉండేం దుకు మతం ముసుగులో బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలు పెంచి రాజకీ యాలు చేస్తున్నది. సామాజిక శక్తులు, దోపిడీ, అణచి వేతకు గురవుతున్న కార్మికులు, రైతులను సంఘటితం చేసి బీజేపీని ప్రతిఘటిస్తాం. వామపక్షాలు, సామాజిక శక్తులు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు, అభ్యుదయవాదు లంతా బీజేపీకి వ్యతిరేకంగా ముందుకు రావాలి. తిరుగుబాటు చేయటానికి కదిలి రండి. సీపీఐ(ఎం) ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జనచైతన్య యాత్ర నేపథ్యంలో నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్‌వెస్లీ చెప్పిన వివరాలు...
నిజామాబాద్‌లో టీచర్ మల్లిఖార్జున్పైనా, ఇంకో ప్రాంతంలో భైరి నరేష్‌పైనా సంఫ్‌ుపరివార్ శక్తులు దాడి చేశాయి. మీరు యాత్ర అక్కడి నుంచే ప్రారంభిస్తున్నారు? ప్రజలకు ఏం చెప్తారు?
రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ మనువాద భావాలు విస్తృతంగా పెరుగుతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామికవాదులు, సామాజిక శక్తులు, మేధావులపై హిందూ మతోన్మాద శక్తుల దాడులు పెరిగాయి. పాఠ్యాంశాల్లో ఉన్న విషయాన్ని బోధించినందుకు టీచర్ మల్లిఖార్జున్‌పై దాడి చేశారు. భైరి నరేష్‌పై దాడి చేయమంటూ నేనే చెప్పానని బండి సంజరు అంటున్నారు. మద్దూర్ మండలంలో ఒకరిపై, కొడంగల్‌లో బాలరాజుపై ఇలా చాలా మందిపై దాడులు జరుగుతున్నాయి. ఎంపీ అర్వింద్ లాంటి వారు మాకు రాజ్యాంగమే అవసరం లేదంటున్నారు. పార్లమెంటులో మెజార్టీ ఉంది కాబట్టి అవసరమైతే రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు. హిందూత్వ ఎజెండాను అమలు చేస్తున్నారు. వర్ణవ్యవస్థ కొనసాగడం, శూద్రులకు చదువుకునే హక్కులేదు, పరిపాలకులుగా ఉండొద్దు, వారంతా సేవకులుగా ఉండాలంటున్నారు. దాన్ని అమలు చేయాలంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం బీజేపీకి అడ్డుగా ఉందని భావిస్తున్నారు. హిందూత్వ ఎజెండాలో భాగంగానే సామాజిక శక్తులపై దాడి జరుగుతున్నది. మల్లిఖార్జున్, నరేష్, బాలరాజు వంటి వారిపై దాడులు పెరిగాయి. మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. మైనార్టీలనే కాదు దళితులు, సామాజిక శక్తులను కూడా అణచివేస్తున్నది. ఓసీలుగా ఉన్న రెడ్డి, వెలమ, కమ్మ కులాల కూడా శూద్రులే. వారికీ అధికారం ఉండొద్దు, చదువుకోవద్దన్నది వారి అభిప్రాయం. బ్రాహ్మణ ఆధిపత్యం ఉండాలన్నదే వారి అభిప్రాయం. రాష్ట్రంలో ఉండే 93 శాతం జనాభా కలిగిన ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలొస్తున్నాయి. సామాజిక శక్తులు ఈ విషయాలను అర్థం చేసుకోవాలి.
రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉందంటారు?
సామాజిక శక్తులకు రాజ్యాంగం అనేక హక్కులు కల్పించింది. అందులో భాగంగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలు ఉద్యోగాలు పొందుతున్నారు. ఇప్పుడు ఓసీల్లో కూడా పేదలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కానీ ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేయడం బీజేపీ విధానం. దీనివల్ల ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు కావు. డిగ్రీ, పీజీ వంటి ఉన్నత చదువులున్నా అడ్డా కూలీలుగా మారుతున్నారు. ప్రయివేటురంగంలో రిజర్వేషన్లు కావాలన్నా దానిపై కేంద్రం చట్టం తేవడం లేదు. 50 శాతానికిపైగా ఉన్న బీసీలకు రూ.45 లక్షల కోట్ల బడ్జెట్లో రూ.రెండు వేల కోట్లు కేటాయించింది. పెట్టుబడిదారులకు రూ.14 లక్షల కోట్ల రాయితీలిచ్చింది. బీసీ గణన చేయాలంటున్నా కేంద్రం అనుకూలంగా లేదు. అది జరిగితే కేంద్రం చేస్తున్న అన్యాయం పట్ల బీసీలు తిరగబడతారని బీజేపీ భావిస్తున్నది. వారిని మభ్యపెట్టేందుకు మతాన్ని వాడుకుంటున్నది. దాన్ని ప్రజల్లోకి తీసుకెస్తాం.
రాష్ట్రంలో బీజేపీ చాపకింద నీరులా విస్తరిస్తున్నదని భావిస్తున్నారా? బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం ఏ పార్టీ?
తెలంగాణపై బీజేపీ కేంద్రీకరించింది. ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు చాపకింద నీరులా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడున్న నాయకులను నమ్మే పరిస్థితిలో ప్రజల్లేరు. అందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్లో బలమైన నాయకులు, ప్రజాప్రతినిధులను కొని బలపడాలని భావిస్తున్నది. మోడీ, షా కూడా అదే పనిలో ఉన్నారు. మునుగోడులో ఓటమితో బీజేపీ దూకుడు తగ్గింది. తెలంగాణ పోరాటాల గడ్డ. సాయుధ రైతాంగ పోరాటానికి వేదిక. అభ్యుదయ భావాలున్న ఈ ప్రాంతంలో బీజేపీ ఆటలు సాగవు. రాబోయే కాలంలో ఉన్న సీట్లు నిలబెట్టుకోవడం కూడా ఇబ్బందే.
రాష్ట్రంలో బీజేపీని నిలువరించేందుకు బీఆర్ఎస్తో కలిసి నడవాలని సీపీఐ(ఎం) నిర్ణయం తీసుకున్నది. దీనివల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలేంటీ?
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో కార్పొరేట్ల ఆస్తులు పెరుగుతున్నాయి. సామాన్యులపై భారాలు పడుతున్నాయి. ఉపాధి హామీకి రూ.రెండు లక్షల కోట్లు అవసరమైతే బడ్జెట్లో కేవలం రూ.60 వేల కోట్లు కేటాయించింది. ఎరువులు, పురుగుమందులపై సబ్సిడీలు ఎత్తేస్తున్నది. దీనివల్ల రైతాంగంపై భారాలు పడుతున్నాయి. కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను హరిస్తున్నది. కార్మిక కోడ్లను తెచ్చి సమ్మె హక్కు, వేతన సవరణ హక్కును లేకుండా చేస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తున్నది. ఇలాంటి ప్రజావ్యతిరేక విధానాలు అవలంభించే బీజేపీ దేశానికి ప్రమాదకరం. బీజేపీ విధానాలు మతోన్మాదానికి అనుకూలం. సామాజిక న్యాయానికి గొడ్డలి పెట్టు. ఒకే దేశం, ఒకే భాష, ఒకే మతం, ఒకే సంస్కృతి అంటున్నది. హిందూమతంలో అనేక కులాలు న్నాయి. హిందువులంతా ఒకే కులం అని ఎందుకు అనడం లేదు. బీజేపీని ఓడించడం కోసమే బీఆర్ఎస్కు మునుగోడులో మద్దతిచ్చాం. భవిష్యత్తులో బీజేపీ పట్ల బీఆర్ఎస్ వైఖరిని బట్టి మా విధానం ఉంటుంది. వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర, సామాజిక శక్తులు ఐక్యం కావాలి. ప్రత్యామ్నాయంగా ఎదగాలి. అప్పుడే రాష్ట్రానికి, ప్రజలకు మేలు కలుగుతుంది.
బీజేపీ విధానాలను నిరంతరం విమర్శిస్తూనే ఉన్నారు. ప్రజలు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. బీజేపీని నిలువరించే శక్తి మీకు ఉందంటారా?
బీజేపీ ప్రమాదాన్ని ఎప్పుడూ చెప్తూనే ఉంటాం. అయితే ఓటు సరుకుగా మారింది. ఇది సీపీఐ(ఎం), ఇతర వామపక్ష పార్టీలకు ఇబ్బందిగా ఉన్నది. అందుకే వామపక్ష అభ్యర్థులకు ఆశించిన ఓట్లు రావడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వామపక్షాలకు ఎవరిని ఓడించాలో ఆ శక్తి ఉన్నది. బీజేపీని ఓడించడమే మా ప్రధాన లక్ష్యం. ప్రజా వ్యతిరేక విధానాలు, మతోన్మాదం, సామాజిక న్యాయానికి విఘాతం కలిగించే అనేక అంశాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తాం. బీజేపీ కార్మికులకు, రైతులకు వ్యతిరేకం. సామాజిక శక్తులైన దళితులు, గిరిజనుల హక్కులను కాలరాస్తున్నది. బీసీలను ఓటుబ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నది. మైనార్టీలు అభివృద్ధిలో వెనకబడి ఉన్నా సచార్ కమిటీ సిఫారసులను అమలు చేయడం లేదు. కార్మికులు, రైతులతోపాటు సామాజిక శక్తులను బీజేపీకి వ్యతిరేకంగా సంఘటితం చేసి ఉద్యమిస్తాం.
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కుమార్ గత ఎన్నికల్లో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఆ విషయాన్ని రైతుల్లోకి ఎలా తీసుకెళ్తారు?
గెలిపిస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానంటూ రైతులకు బాండ్ పేపర్ల మీద సంతకం చేసి మరీ హామీ ఇచ్చారు. గెలిచాక ఆ ఊసేలేదు. పోరాడిన రైతులను హేళన చేశారు. ఇచ్చిన హామీ అమలు కోసం ప్రయత్నించడం లేదు. ప్రజాస్వామిక విలువలను అపహాస్యం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. దీన్ని అక్కడి ప్రజలకు, రైతులకు అర్థమయ్యేలా చెప్తాం. వచ్చే ఎన్నికల్లో అర్వింద్‌ను ఓడిస్తాం.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వలసలు ఆగిపోయాయా? ప్రజలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లభించాయా?
దేశంలోనే వెనుకబడిన జిల్లాగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు పేరున్నది. ఏటా వేలాది మంది ఉపాధి కోసం వలసలు పోతారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ అధికారంలో ఉన్నా అభివృద్ధికి చర్యలు చేపట్టలేదు. తెలంగాణ వచ్చాక కొంత మార్పు వచ్చింది. అయినా వలసలు ఆగిపోలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాలేదు. నీటి వనరులు పూర్తిస్థాయిలో రైతాంగానికి అందలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడం లేదు. కానీ బీజేపీని వ్యతిరేకిస్తున్నందుకే బీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నాం. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలుకు రాజీలేని పోరాటం చేస్తాం.
హిందూ ముస్లిం మత ప్రాతిపదికన, కులాల పేరుతో ప్రజల మధ్య విభజన రాజకీయాలున్నాయి. దీన్ని ఎలా అధిగమిస్తారు?
హిందూ ముస్లిం మధ్య వైషమ్యాలను బీజేపీ రెచ్చగొడుతున్నది. మెజార్టీ ప్రజలైన హిందువుల ఓట్లతో అధికారంలోకి రావాలని భావిస్తున్నది. కార్పొరేట్లకు వనరులను కట్టబెడుతూ దోపిడీ కొనసాగిస్తున్నది. మత విద్వేషాలు పెంచి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడు తున్నది. భాగ్యలక్ష్మి ఆలయం, మసీ దులను తవ్వాలంటూ బండి సంజరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తు న్నారు. భగత్‌సింగ్ చరిత్రను తొల గించి ఆర్ఎస్ఎస్ వారి చరిత్రను పాఠ్యాంశాల్లో పెడుతున్నారు. పురా ణాలను చదవాలంటున్నారు. మా యాత్ర సందర్భంగా బీజేపీ చేసే ఈ చర్యలను వివరిస్తాం. లౌకిక శక్తులు, సామాజిక శక్తులు, మేధావులను ఐక్యం చేసి మతోన్మాద చర్యలు ఎండగడతాం.
ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం అడ్డగోలుగా ప్రయివేటువారికి అమ్మడాన్ని ప్రజలు ఎలా భావిస్తున్నారు? కేంద్రం తీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందంటారా?
పార్లమెంటులో మెజార్టీ ఉంది కాబట్టి ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తున్నది. కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెడుతున్నది. దీనివల్ల సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమవుతున్నది. ఇంకోవైపు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలు, మహిళలు రిజర్వేషన్లను కోల్పోతున్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరమున్నది. సామాజిక తరగతులకు తీరని అన్యాయం జరుగుతున్నది. కొందరు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నది. ఉప్పెనలా ప్రజలు తిరగబడి బీజేపీని ప్రతిఘటిస్తారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దెదిం చుతారు. ఆ రకమైన చైతన్యాన్ని మేం కల్పించేందుకు ఈ యాత్ర ద్వారా కృషిచేస్తాం.