Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకే నెలలో 15 కిడ్నీ మార్పిడి సర్జరీలు
- దేశంలోనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరికొత్త చరిత్ర
- ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా శస్త్ర చికిత్సలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి జాతీయ రికార్డు సష్టించింది. ఈ ఏడాది జనవరిలో 15 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించింది. దేశంలో ఒకే నెలలో అత్యధిక కిడ్నీ మార్పిడులు చేసిన ప్రభుత్వ ఆస్పత్రిగా జాతీయ రికార్డు సాధించింది. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు సోమవారం ఒక ప్రకటనలో నిమ్స్ యూరాలజీ విభాగాన్ని అభినందిం చారు. అవయవ మార్పిడి సర్జరీలను ఖర్చుకు వెనుకాడకుండా ఆరోగ్యశ్రీకింద పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నిమ్స్ డైరెక్టర్ బీరప్ప అధ్వర్యంలో, నిమ్స్ యూరాలజీ విభాగం ఒకే నెలలో 15 కిడ్నీ మార్పిడి సర్జరీలు విజయ వంతంగా నిర్వహించి జాతీయ రికార్డు సృష్టించడం, పేషంట్లందరూ ఆరోగ్యం గా ఉండటం మంచి విషయం. రాష్ట్ర ప్రభుత్వం అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలన్నీ ఆరోగ్యశ్రీ తో పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా ఈ సర్జరీల్లో భాగస్వాములైన వైద్య బృందం, జీవన్ దాన్ కోఆర్డినేటర్ స్వర్ణలతకు మంత్రి హరీశ్ రావు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
నిమ్స్ యూరాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ రాహుల్ దేవరాజ్ నేతృత్వంలో డాక్టర్ సీహెచ్ రామ్ రెడ్డి, డాక్టర్ ఎస్ విద్యాసాగర్, డాక్టర్ జీ రామచంద్రయ్య, డాక్టర్ జీవీ చరణ్ కుమార్, డాక్టర్ ఎస్ఎస్ఎస్ ధీరజ్‌తో కూడిన బృందం ఈ సర్జరీలను విజయవంతంగా నిర్వహించింది. డాక్టర్ పద్మజ, డాక్టర్ జే.నిర్మల నేతృత్వంలోని అనస్థీషియా విభాగం నుంచి డాక్టర్ శిభాని, ఇందిర, డాక్టర్ టీ.గంగాధర్, డాక్టర్ భూషణ్ రాజ్ నేతృత్వంలోని నెఫ్రాలజీ విభాగం వారికి సహకరించారు.
మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ఫ్లాంట్ సెంటర్‌గా నిమ్స్
నిమ్స్ ఆస్పత్రి మల్టీ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌గా మారింది. ఇక్కడ కిడ్నీతోపాటు కాలేయం, గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. అవయవ మార్పిడులకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు కేటాయిస్తూ, పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నది. అంతే కాకుండా రోగులకు జీవితాంతం అవసరమయ్యే మందులను ఉచితంగా అంజేస్తున్నది. ప్రభుత్వ ప్రోత్సాహంతో విజయవంతంగా సర్జరీలు చేస్తున్నట్టు యూరాలజీ విభాగం అధిపతి డాక్టర్ రాహుల్ దేవరాజ్, తెలిపారు. నిమ్స్‌లో 2014 నుంచి 839 కిడ్నీ మార్పిడులు జరిగాయి. ఇందులో 509 లైవ్ ట్రాన్స్‌ప్లాంట్ కాగా, 330 కెడవర్ నుంచి సేకరిం చినవి. 25 కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలను నిర్వహించారు. ఇందులో 11 లైవ్, 14 కెడవర్ ఉన్నాయి. 10 గుండె మార్పిడి సర్జరీలను విజయ వంతంగా నిర్వ హించారు. ఒకరికి ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీ జరిగింది.