Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిడ్డను కాపాడుకునేందుకు కేసీఆర్ కొత్త డ్రామా : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సంతకాలు లేకుండా వివిధ పార్టీల నేతల, ముఖ్యమంత్రుల సంతకాలతో ప్రధానమంత్రి నరేం ద్రమోడీకి లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందనీ, దొంగ సంతకాలు పెట్టడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. లిక్కర్ కేసులో తన బిడ్డను కాపాడుకునేందుకు సిసోడియా అరెస్టును ఖండిస్తూ కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరలేపారన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాల యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ అవినీతిపై కోటిమందితో సంతకాలు సేకరిం చి రాష్ట్రపతికి అందజేస్తామని తెలిపారు. గతంలో వరద సాయం సమయంలో, దళిత బంధు పథకం విషయంలో తన పేరు మీద ఫోర్జరీ లెటర్ సృష్టిం చారని ఆరోపించారు. రాష్ట్ర సీఎస్‌ను దాదాపు 30 సార్లు కోర్టు ధిక్కరణ కేసుల్లో న్యాయ స్థానం మంద లించిందన్నారు. 10 ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయని మహిళా గవర్నర్‌ను బదనాం చేస్తున్న కేసీఆర్ తన దగ్గర 10 వేల ఫైళ్లు పెండింగ్‌లో పెట్టుకున్నారనీ, 50 వేల జీవోలను వెబ్ సైట్లో పెట్టకుండా చీకట్లో పెట్టారని విమర్శించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, కోశాధికారి బండారి శాంతికుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్‌రెడ్డి, అధికార ప్రతినిధి పోరెడ్డి కిశోర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలి
ప్రీతి కుటుంబానికి న్యాయం దక్కేవరకూ పోరా డుతామని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల కు నిరసనగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ లక్ష్మణ్, జాతీయ కార్యదర్శి అర వింద్ మీనన్, తమిళనాడు సహ ఇన్చార్జి పి.సుధా కర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్. ఇంద్ర సేనారెడ్డి, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావు, విజయ శాంతి, మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎంపీ బూర నర్స య్యగౌడ్, ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. డెడ్ బాడీలను ఎత్తికెళ్లే నీచమైన సర్కార్ కేసీ ఆర్‌దేనని విమర్శించారు. ప్రీతి హత్య కేసును ప్లాన్ ప్రకారమే నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. సిట్టి ంగ్ జడ్జితో ఎందుకు విచారణ జరపటం లేదని ప్రశ్ని ంచారు. బీజేపీ అధికారంలో కొస్తే యూపీ తరహా మహిళలపై అఘాయిత్యాలు చేసే వాళ్ల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చేస్తామని హెచ్చరించారు.