Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారు ప్రకటన
నవతెలంగాణ -హైదరాబాద్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. ఆయా రంగాలకు చెందిన మొత్తం 27 మందిని ఈ అవార్డులకు ఎంపిక చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి భారతి హౌళీకేరి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. 2023 సంవత్సరానికి గానూ ఈ ఎంపిక జరిగింది. అవార్డుతోపాటు ప్రతి ఒక్కరికి రూ.లక్ష చొప్పున నగదు పురస్కారాన్ని అందజేయనున్నారు.
వీరివే అవార్డులు
బానోతు జ్యోతి - అంగన్వాడీ టీచర్
గుండా రాజకుమారి - సెంటర్ కోఆర్డినేటర్, భరోసా సెంటర్
ఆల్ఫి కిండన్జెన్ - సోషల్ సర్వీస్
మీనాక్షి గాడ్గె - ముఖ్రా కే సర్పంచ్
సుజాత దీక్షిత్ - థియేటర్
స్వరూప పొట్లపల్లి - జర్నలిజం
డాక్టర్ బండారు సుజాత శేఖర్ - ఫోక్ లిటరేచర్
అరుణ నారదభట్ల - లిటరేచర్
డాక్టర్ అమూల్య మల్లన్నగారి - హెల్త్
నారా విజయలక్ష్మి(పీహెచ్) - పెయింటర్
ఓఎన్ఐ సిస్టర్స్(వినోద, విజయ, విజయలక్ష్మి) - మ్యూజిక్
రుక్మిణి, ఇన్స్పెక్టర్ -షీ టీమ్స్ భరోసా సెంటర్
అనసూయ, ఐపీఎస్, డీసీపీ -పోలీసు డిపార్ట్మెంట్
అన్వితా రెడ్డి - మౌంటెయినర్
త్రిష గొంగడి - స్పోర్ట్స్(అండర్ -19 క్రికెటర్)
డాక్టర్ అనురాధ తడకమళ్ల - క్లాసికల్ డ్యాన్స్
దంటు కనకదుర్గ -సోషల్ యాక్టివిస్ట్
డాక్టర్ మాలతి - హెల్త్, సూపరింటెండెంట్, ఎంజీఎంహెచ్, పేట్లబుర్జ్
సమంత రెడ్డి - ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్
కర్నె శంకరమ్మ - కిన్నెర, ఫోక్
డాక్టర్ గుడూరు మనోజ - ఆద్య కళ
సామళ్ల శ్వేత - కమ్యూనిటీ మొబిలైజేషన్
జి. నందిని - సూపర్వైజర్, నిజామాబాద్(అ) ప్రాజెక్ట్
రజియా సుల్తానా - ఏడబ్ల్యూహెచ్, కౌడిపల్లి, ఐసీడీఎస్ - నర్సాపూర్
ఎం. కష్ణవేణి - ఆశా వర్కర్
ఇందిర - ఏఎన్ఎం
డాక్టర్ కె. రాణిప్రసాద్ - లిటరేచర్