Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీయుఎంహెచ్ఇయూ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్టంలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఫిబ్రవరి నెల వేతనాన్ని వెంటనే చెల్లించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (టీయుఎంహెచ్ఇయూ) రాష్ట్ర అధ్యక్షులు ఎండీ ఫసియుద్దిన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయ క్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొట్లాడి కోరుకొని తెచ్చుకున్న ధనిక రాష్ట్రం తెలం గాణ ఎనిమిదేండ్లకే అప్పులపాలు కావడం దేనికి నిదర్శనమని ప్రభు త్వాన్ని ప్రశ్నించారు. 33 జిల్లాల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు గత కొన్ని నెలల నుంచి సక్ర మంగా వేతనాలు అందకపోవడం దుర్మార్గం అని పేర్కొన్నారు. ఫలితంగా సిబిల్ స్కోర్ పడి పోతుందనీ, దీని కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త అప్పులు ఇచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వ కంగా సమస్యలు పరిష్కరించకుండా ఉద్యోగులను చిన్న చూపు చూసి ప్రజల్లో గౌరవం లేకుండ చేయడం త గదని హితవు పలికారు. ప్రభు త్వం ప్రతినెల 1వ తేదీన వేతనాలు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయ,పెన్షనర్ల ను ఐక్యం చేసి దశల వారి ఆందోళన పోరాటాల కోసం కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.