Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, విస్తరణ, కార్యకలాపాల కోసం టీఎస్ఆర్టీసీ జంటనగరాల్లోని ఐదు డిపోలను కేటాయించింది. దిల్సుఖ్నగర్, హయత్నగర్, జీడిమెట్ల, మియాపూర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ డిపోలను దీనికోసం కేటాయించింది. అయితే ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 40 ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయి. వీటి నిర్వహణ కోసం గతంలోనే మియాపూర్, కంటోన్మెంట్ డిపోలను కేటాయించారు. బస్సుల పార్కింగ్తో పాటు చార్జింగ్ కేంద్రాలను కూడా ఇక్కడ ఆర్టీసీ ఏర్పాటు చేస్తుంది. డిపోల కేటాయింపు విషయాన్ని మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీ ప్రదీప్ తెలిపారు. తమ సంస్థలకు టీఎస్ఆర్టీసీ నుంచి 500 ఇంట్రాసిటీ, 50 ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ లభించిందని వివరించారు. త్వరలోనే తొలిదశ బస్సుల్ని ఆర్టీసీకి అప్పగిస్తామన్నారు. వీటిలో ఎయిర్ కండీషన్డ్ ఇంటర్సిటీ కోచ్ ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్, విజయవాడ మధ్య తిరుగుతాయని చెప్పారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చన్నారు. ఇంట్రాసిటీ ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ సిటీలో తిరుగుతాయనీ, వీటిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయని వివరించారు. దీనిపై టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ స్పందిస్తూ వచ్చే రెండేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 3,400 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ 2025 మార్చి నాటికి హైదరాబాద్ అంతటా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా తొలిదశలో 550 బస్సులను ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు.