Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదనాయక్
నవతెలంగాణ-కంఠేశ్వర్
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదానాయక్ డిమాండ్ చేశారు. వైద్యారోగ్య శాఖలో ఉన్న పలు సమస్యలపై సోమ వారం నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యాద నాయక్ మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న రెండవ ఏఎన్ఎంలు, ఈసీఏఎన్ఎంలు, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఎ.ఎన్.ఎంలు, వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను బేష రుతుగా రెగ్యులర్ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి అధికారం చేపట్టగానే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వ్యవస్థ లేకుండా చేసి అందరినీ బేషర తుగా శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తామని మాయ మాటలు చెప్పి రెండుసార్లు అధికారం లోకి వచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విమ ర్శించారు. పీఆర్సీ బకాయిలు చెల్లించడం లేదని తెలిపారు. కనీసవేతనం అమలు చేయడం లేదన్నారు. బేషరతు గా వైద్య ఆరోగ్యశాఖలో, వివిధ కేటగిరిలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరిని శాశ్వత పద్దతిన నియమించాలని డిమాండ్ చేశారు. కనీసవేతనం అమలు చేస్తూ పీఆర్సీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే వేతనంతో కూడిన మెటర్నరీ లీవ్‌లు అందించాలని, రికార్డులు, రిపోర్టులు, ఇంటర్నెట్ వాడకం గురించి విధిగా అదనపు అలవెన్సులు మంజూరు చేయాలని కోరారు. ఖాళీ పోస్టులన్నిం టినీ భర్తీ చేసి పనిభారం తగ్గించాలన్నారు. కార్య క్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్, జిల్లా అధ్యక్షులు శంకర్‌గౌడ్, యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జార్జ్, షాదుల్లా, మురళి, వేణు గోపాల్, ప్రవీణ్‌రెడ్డి, పుష్ప, సంధ్య, గంగా జమున, కవిత పాల్గొన్నారు.