Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు కమిటీ ఏర్పాటు
- దండించే అధ్యాపకులపై నిషేధం
- యాజమాన్యాల సమావేశంలో ప్రభుత్వ నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి శ్రీచైతన్య కాలేజీపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరంలో ఆ కాలేజీ గుర్తింపును రద్దు చేస్తు న్నట్టు ప్రకటించింది. దీంతో వచ్చే విద్యాసంవత్సరం అక్కడ ప్రవేశాలుం డవు. సోమవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో శ్రీచైతన్య, నారా యణతోపాటు పలు ప్రయివేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాలతో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ సమావేశాన్ని నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి హాజరు కావాల్సి ఉన్నా చివరినిమిషంలో రాలేదు. అయితే ఈ సమావేశం లో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకున్నది. షాద్‌నగర్‌కు చెందిన సాత్విక్ శ్రీచైతన్య కాలేజీ ప్రిన్సిపాల్, ఇతర అధ్యాపకుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. కార్పొరేట్ కాలేజీల మార్కులు, ర్యాంకులకు సంబంధించి ప్రచారం చేయడం పైనా దృష్టి సారించింది. వాటి నియంత్రణ కోసం కమిటీని ఏర్పాటు చేస్తు న్నట్టు ప్రకటించింది. ఇంకోవైపు విద్యార్థుల ఆత్మ హత్యలను నివారించేందుకు కమిటీ వేయాలని నిర్ణయించింది. త్వరలోనే కమిటీ సభ్యులు, విధి విధా నాలను ప్రకటించనుంది. విద్యార్థులను దండించే, దూషించే అధ్యాపకులు ఎక్కడా పనిచేయకుండా నిషేధం విధించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు వివరించింది. ఈ సందర్భంగా నవీన్ మిట్టల్ మాట్లాడుతూ ఒక అనుమతి తీసుకుని పలు కాలేజీలను నిర్వహిస్తున్న యాజమాన్యాలకు చెక్ పెడతా మని చెప్పారు. విద్యార్థుల ఆత్మహత్యలకు అనేక కారణాలున్నాయనీ, వాటి ని అధ్యయనం చేస్తామన్నారు. గ్రేడింగ్ విధానం తేవాలని ప్రభుత్వానికి సూచించామని వివరించారు. నియమ నిబంధనల ప్రకారమే కాలేజీలు నడిచేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు ఎంతో ముఖ్యమనీ, వారిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా నడిచే కాలేజీలపై కఠిన చర్యలు తీసు కుంటా మన్నారు. ప్రయివేటు జూనియర్ కాలేజీల్లోనూ బయో మెట్రిక్ విధానాన్ని ప్రవేశపెడ తామని అన్నారు. వాటిలో కౌన్సిల ర్లను నియమించాలని చెప్పారు. తప్పనిసరిగా విద్యార్థులకు ఒత్తిడి లేకుండా ఎలా ఉండాలో చెప్పేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.కార్యక్రమంలో శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థల ప్రతినిధులు, వివిధ కాలేజీల అధినేతలు, టీపీజేఎంఏ అధ్యక్షులు గౌరి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.