Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10న విద్యుత్‌శాఖ మంత్రితో చర్చలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణపై ఈనెల 10వ తేదీ విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డితో చర్చలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించిన ఆందోళనలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. వేతన సవరణతో పాటు ఇతర సమస్యల్ని కూడా పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఆందోళనలు నిర్వహిస్తున్నట్టు జేఏసీ చైర్మెన్ జీ సాయిబాబు, కన్వీనర్ పి రత్నాకరరావు తెలిపారు. విద్యుత్ సౌధలో సీఎమ్‌డీలతో జరిగిన చర్చలు విఫలమయ్యాక, ఆందోళనలు కొనసాగిస్తామని పిలుపునిచ్చామని చెప్పారు. కానీ ఈనెల 10వ తేదీ మంత్రితో చర్చలకు రావాలని యాజమాన్యం ఆహ్వానించిన నేపథ్యంలో బుధవారం నుంచి ప్రారంభం కావల్సి ఉన్నరిలే నిరాహార దీక్షలను తాత్కాలి కంగా వాయిదాలి వేయాలని నిర్ణయించామన్నారు. 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు చర్చలకు రావాలని విద్యుత్‌శాఖ మంత్రి కార్యాలయం సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. ఆ చర్చలు అనంతరం టీఎస్పీఈజేఏసీ నాయకత్వం తదుపరి కార్యాచరణను ప్రకటిస్తుందని పేర్కొన్నారు.