Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బర్త్ సర్టిఫికెట్ల జారీ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, ఆధారాల్లేకుండా 27వేల బర్త్ సర్టిఫికెట్లు, 4వేల డెత్ సర్టిఫికెట్లు జారీ చేయడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. దొంగ బర్త్ సర్టిఫికెట్లతో పాస్‌పోర్టులు పొంది పాతబస్తీలో ఉగ్రవాదులు పాగా వేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా మూలాలు హైదరాబాద్‌లోనే బయటపడుతున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే బర్త్ సర్టిఫికెట్ల జారీపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. పాతబస్తీలో జారీ చేసిన బర్త్, డెత్ సర్టిఫికెట్లతో పాటు రేషన్, ఓటర్ కార్డులపైనా సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరారు. తూతూ మంత్రంగా విచారణ జరిపి కిందిస్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు.