Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అద్భుత చారిత్రక కట్టడాలుగా ఆవిష్కరింపబడనున్న అంబేద్కర్ విగ్రహం, అమర జ్యోతి, సచివాలయం నిర్మాణాలపై కవితలను ఆహ్వానిస్తున్నామని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరు గౌరీ శంకర్ తెలిపారు. మూడు అంశాలపైనా విడివిడిగా కవితలను పంపాలని సూచించారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశా రు. చారిత్రక కట్టడాల వైభవాన్ని అక్షరాల్లో ప్రపంచానికి దాటి చెప్పడానికి సృజన కారులంతా కలాలు కదిలించాలని పిలుపునిచ్చారు. అద్భుత కట్టడాల నిర్మాణాలు చూసినప్పుడు ఒళ్ళు పులకరించడం, భావావేశం తన్నుకు రావడం ఖాయమని పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహం, రాష్ట్ర సచివాలయం, అమర జ్యోతిపై కవులు, విద్యార్థులు, భావుకత ఉన్న రచయితలు 25 లైన్లకు మించ కుండా కవితలు రాసి పంపాలని కోరారు. సంగ్రహించిన కవితలతో సంకల నం తేవాలని సాహిత్య అకాడమి సంకల్పించిందని తెలిపారు. మార్చి 31లో గా రాసిన కవితలను [email protected]కుగానీ ,9440233261 నెంబర్కు వాట్సాప్ ద్వారాగానీ పంపాలని సూచించారు.