Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ కౌన్సిల్, స్థానిక ప్రభుత్వ అథారిటీ నుంచి ఎంపిక చేసిన 23 మంది ప్రతినిధులకు హైదరాబాద్లోని ఎన్ఐఆర్డీపీఆర్లో శిక్షణను మంగళవారం ప్రారంభించారు. రెండు దేశాల మధ్య స్థానిక సంస్థల బలోపేతం, అభివృద్ధి కోసం పరస్పరం సహకారం అందించుకునే విషయంపై ఎన్ఐఆర్డీపీఆర్, రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ మధ్య ఎంఓయూ జరిగింది. శిక్షణా కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఎన్ఐఆర్డీపీఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శశిభూషణ్ మాట్లాడుతూ..రెండు వారాల శిక్షణలో స్థానిక సంస్థల అభివృద్ధి ప్రణాళిక, వనరుల సమీకరణ, ఆర్థిక నిర్వహణ, ఈ-గవర్నెన్స్, సర్వీస్ చార్టర్లు, మహిళా సాధికారత, తదితరాలపై ప్రతినిధులు అవగాహన, జ్ఞానం పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ ప్రొఫెసర్ భంజా, లోకల్ గవర్నమెంట్ అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి అఫ్షాన్ లతీఫ్, లోకల్ గవర్నమెంట్ అథారిటీ డైరెక్టర్ జనరల్ షామూన్ ఆడమ్, ఐఎఫ్ఎస్ అధికారి, హైకమిషన్ కార్యదర్శి కరణ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.