Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్కు పొన్నాల ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రానికి కొత్త కంపెనీలు, విరివిగా పెట్టుబడులు వస్తున్నాయంటూ మంత్రి కేటీఆర్ ప్రచారం చేస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. ప్రపంచంలో ఫేక్ ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం పబ్బం గడుపుతున్నదని ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అబద్ధపు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి అంత ఇంత కాదన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో తెచ్చిన కంపెనీలు విస్తరణ చేయడం తప్ప...టీఆర్ఎస్ కొత్త కంపెనీలు ఎన్ని తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్త కంపెనీలపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.