Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగోడు
పెట్రోల్ పోసి నిప్పట్టించిన వ్యక్తిపై కేసు నమోదైన సంఘటన మెదక్ జిల్లా రేగోడు మండలం మర్పల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. మెదక్ డీఎస్పీ సైదులు తెలిపిన వివరాల ప్రకారం... హౌలీ పండుగ సందర్భంగా మర్పల్లి గ్రామంలో యువకులు ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. అనంతరం స్నానం చేసేందుకు గ్రామంలోని చెరువు వద్దకు వెళ్తుండగా బుర్రి అంబదాస్ బైకులో పెట్రోల్ అయిపోయింది. అంబదాస్ ఇంటికి వెళ్లి పెట్రోల్ తెచ్చుకున్నాడు. అక్కడే ఉన్న షబ్బీర్‌పై అంబదాస్ కలర్ చల్లుతానని అన్నాడు. తన మీద నువ్వేం చల్లుతావురా అంటూ అంబదాస్ చేతిలో ఉన్న పెట్రోల్ బాటిల్‌ను షబ్బీర్ లాగేసుకున్నాడు. అంబదాస్పై షబ్బీర్ పెట్రోల్ పోసి నిప్పటించాడు. అక్కడే ఉన్నవారు మంటలను ఆర్పారు. గాయపడిన అంబదాస్ను నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాదులోని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. అంబదాస్ అక్క శాంతమ్మ ఫిిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. సీఐ జార్జ్, ఎస్ఐ సత్యనారాయణ, అల్లాదుర్గం ఎస్ఐ ప్రవీణ్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.