Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ నల్గొండ
కాంగ్రెస్ సీనియర్ లీడర్, భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై నల్లగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 506 సెక్షన్ కింద నల్లగొండ వన్ టౌన్ పోలీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై కేసు నమోదు చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు చెరుకు సుధాకర్, ఆయన కొడుకు డాక్టర్ చెరుకు సుహాస్‌ను చంపుతానని బెదిరించిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చెరుకు సుధాకర్‌ను తన అనుచరులు చంపేస్తారంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్‌కు కోమటిరెడ్డి కాల్ చేసిన ఆడియో వైరల్ అయ్యింది. ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని చెరుకు సుధాకర్, కొడుకు సుహాన్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎంపీపై పోలీసులు కేసు నమోదు చేశారు.