Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆరోగ్యం, సంపదకు హైదరా బాద్ గమ్యస్థానంగా మారిందనీ, చాలా అవకాశాలతో ప్రపంచానికి ఫార్మా రాజధాని అయిందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ ప్రశంసించారు. మంగళవారం హైదరాబాద్ తార్నాకలోని సీఎస్ఐఆర్-ఐఐసీటీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఒక వారం-ఒక పరిశోధనా కేంద్రం వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాలను నిలిపే ఔషధాల అభివృద్ధిలో సీఎస్ఐఆర్ కీలక పాత్ర పోషిస్తు న్నదని తెలిపారు. మంత్రి సమక్షంలో సీఎస్ఐఆర్-ఐఐసీటీ మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్)తో ఒప్పందం చేసుకున్నది. దీని ద్వారా ఎంఆర్ పీఎల్ మాస్టర్ రీసర్చ్ అలయెన్స్ అగ్రిమెంట్లో ప్రవేశించినట్టైంది. అదే విధంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రాథమికంగా వాడే మెటఫార్మిన్ ఔషధ ముడి సరుకును దేశీయంగా అభివృద్ధి చేసే సాంకేతికతను పొందేందుకు వీలుగా గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్ ఐఐసీటీతో ఎంఒయూ ఒప్పందం కుదుర్చుకుంది. పీజీ విద్యార్థు ల్లో నైపుణ్య శిక్షణకు వీలుగా అర్జెన్, కెవనీ ల్యాబ్ వే ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ తోనూ ఐఐసీటీ ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో సీఎస్ఐఆర్ -ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, భారత్ బయోటెక్ డాక్టర్ క్రిష్ణ ఎల్లా, ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఎండీ డాక్టర్ ఎంఎస్ఎన్ రెడ్డి, సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ రామానుజ్ నారాయణ్, ఛీఫ్ సైంటిస్ట్ డాక్టర్ డి.శైలజ తదితరులు పాల్గొన్నారు.
సూపర్ ఫుడ్స్ స్నాక్స్ విడుదల
సీఎస్ఐఆర్ -ఐఐసీటీ అభివృద్ధి చేసిన సాంకేతికతో ఎస్డీజీ హెల్త్‌కేర్‌కు చెందిన తొమ్మిది రకాల సూపర్ ఫుడ్స్ స్నాక్స్ ప్యాకెట్లను ఆయన విడుదల చేశారు. వీటిని తీసుకోవడం ద్వారా జీవనశైలి మార్పుల కారణంగా వస్తున్న ఊబకాయం తదితర సమస్యల నుంచి బయటపడవచ్చని సూపర్ పుడ్స్ సీఇవో డాక్టర్ ప్రణవ్ తెలిపారు. ఇందులో ఇది సహజ సిద్ధంగా దొరికే వాటి నుంచి లభించే పౌష్టిక, ఔషధ విలువలు కలిగి ఉంటాయని చెప్పారు. ఇవి పౌష్టికాహార లోపంతో బాధపడే చిన్నారులకు అత్యంత ఉపయోగకరమని వెల్లడించారు.