Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనేక కార్యక్రమాలు, పథకాల అమలు : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం మహిళా జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక కార్య క్రమాలు, పథకాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కె.టి.రామారావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో మహిళా జర్న లిస్ట్‌లకు పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళా జర్న లిస్టులకు వి-హబ్ ద్వారా 2 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. జర్నలిస్టుల కుటుంబాలకు మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మహిళ జర్నలిస్టులు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసు కుని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 19 వేల మంది జర్నలిస్టులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇచ్చామన్నారు. గుజరాత్లో కేవలం 3 వేలు కార్డులు మాత్రం ఉన్నాయన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారనీ, సమర్థవం తంగా పని చేస్తున్నారని కొనియాడారు. మీడియా సంస్థలు కూడా పాజిటివ్ ప్రచారం చేయాలని కోరారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆయా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న 138 మంది మహిళ జర్నలిస్ట్‌లకు మంత్రి ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పురస్కార గ్రహీతలు అవార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు జగదీష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ శాంతి కుమారి, సమాచార శాఖ కమిషనర్, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.