Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఎస్‌యూటీఎఫ్ బలపరిచిన అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డికి ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్ (టీటీఏ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం టీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ హరికిషన్, ప్రధాన కార్యదర్శి వి శ్రీనునాయక్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు జె శ్రీనివాస్ రాథోడ్, కోశాధికారి కె కిషన్, రంగారెడ్డి జిల్లా నాయకులు శ్రీనివాస్ నాయక్ సమక్షంలో మద్దతు లేఖను టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి, ఎమ్మెల్సీ అభ్యర్థి మాణిక్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా హరికిషన్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగం, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న టీఎస్‌యూటీఎఫ్‌తో ఐక్య ఉద్యమాల్లో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ఈ ఐక్యతను బలోపేతం చేసేందుకే మాణిక్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని వివరించారు. టీటీఏ నాయకులు, కార్యకర్తలందరూ మాణిక్‌రెడ్డి గెలుపు కోసం స్వచ్ఛందంగా కృషి చేస్తామని ప్రకటించారు. టీటీఏ మద్దతు ప్రకటించడం పట్ల టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి, ఎమ్మెల్సీ అభ్యర్థి మాణిక్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.