Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తాం
- 2030 నాటికి 250 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లక్ష్యం : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలో 2030 సంవత్సరం నాటికి 250 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించాలనేదే తమ లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి మళ్లీ తామే వస్తామనీ, లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులకు అనేక అవకాశాలు ఉన్నాయని స్పష్టంచేశారు. మంగళవారంనాడిక్కడ జరిగిన సీఐఐ తెలంగాణ శాఖ వార్షిక సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై, మాట్లాడారు. ఫార్మా పరిశ్రమలకు ఒకేచోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంస్థలు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి సంస్థలు అతిపెద్ద క్యాంపస్లను హైదరాబాద్లో ఏర్పాటు చేశాయన్నారు.
మళ్లీ తామే అధికారంలోకి వస్తామనీ, పెట్టుబడుల్ని రప్పించి, మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఫార్మా పరిశ్రమలకు ఒకేచోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నామనీ, సుల్తాన్పూర్ వద్ద అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్కు ఏర్పాటు చేశామన్నారు. ప్రయివేటు రంగంలో ఉపగ్రహాల తయారీ మొదటిసారి హైదరాబాద్లోనే జరిగిందన్నారు. భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల మాట్లాడుతూ దక్షిణాది ప్రాంతం విదేశీ కంపెనీలకు గమ్యస్థానంగా మారిందని చెప్పారు. రాష్ట్రం సాధిస్తున్న వృద్ధి, ప్రోత్సాహకాల వల్లే పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.