Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరల్డ్ టూర్స్ అండ్ ట్రావెల్ ఆపరేటర్ల సమావేశంలో మంత్రి శ్రీనివాసగౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆరోగ్య, సంపద, ఫార్మా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికే రాజధానిగా నిలిచిందని పర్యాటక, సాంస్కతికశాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ఇంటర్నేషనల్ టూరిజం కల్చర్ ఎగ్జిబిషన్లో భాగంగా బుధవారం బెర్లిన్‌లో ట్రావెల్ అండ్ టూర్ ఆపరేటర్స్ సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతూ...ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలు, బతుకమ్మ, బొడ్డెమ్మ పండుగలు ఎంతో ప్రత్యేకమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బుద్ధిజానికి పూర్వవైభవాన్ని తీసుకొస్తున్నామన్నారు. నాగార్జునసాగర్‌లో బుద్ధవనం ప్రాజెక్టును ప్రపంచస్థాయిలో నిర్మించామని వివరించారు. కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లను సరఫరా చేసిన ఘనత హైదరాబాద్ నగరానికి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియా టూరిజం సెక్రటరీ అరవింద్ సింగ్, భారత రాయబారి పర్వతనేని హరీష్, తెలంగాణ టూరిజం ఎండి మనోహర్, తదితరులు పాల్గొన్నారు.