Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజక వర్గ ఎన్నికల్లో పాపన్నగారి మాణిక్రె డ్డికి టీఎస్పీటీఏ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ షౌకత్ అలీ, పిట్ల రాజయ్య బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయుల ప్రయోజ నాలు తాకట్టు పెడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, వారి సమస్యలను ప్రశ్నించే ధైర్యం, తెగువ ఉన్న వ్యక్తిగా మాణిక్‌రెడ్డిని గుర్తించి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఎన్నికలు నిర్వహించే ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న టీఎస్పీటీఏ శ్రేణులు, అభిమానులు, సమస్యలు పరిష్కారం కావాలని కోరుకునే ఉపాధ్యాయులు మాణిక్‌రెడ్డి ని గెలిపించడానికి కృషి చేయాలనీ, ప్రచారంలో పాల్గొనాలనీ వారు కోరారు.