Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షర్మిల మౌనదీక్ష..అరెస్టు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు తప్ప మహిళలకు రక్షణ లేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఈమేరకు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లోని రాణిరుద్రమదేవి విగ్రహం వద్ద మౌన దీక్ష చేట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు షర్మిలకు వాగ్వాదం చోటుచేసుకుంది. షర్మిలను అరెస్టు చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కవిత ఆడపిల్లై ఉండి సిగ్గులేకుండా లిక్కర్ స్కామ్ చేశారని ఆరోపించారు. బతుకమ్మ ముసుగులో కవిత లిక్కర్ స్కాంకు పాల్పడ్డారని విమర్శించారు. బీఆర్ఎస్లో మహిళలకు రిజర్వేషన్ ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో విద్యార్థినిలకు బాత్ రూమ్‌లు కూడా లేవన్నారు. ఎక్కడ మహిళ గౌరవించబడుతుందో అక్కడే అభివృద్ది జరుగుతుందని చెప్పారు. మహిళ భద్రతపై ప్రభుత్వం గొప్పలు చెబుతున్నదనీ, మహిళలపై అత్యాచారాల విషయంలో దక్షిణ భారతదేశం లోనే తెలంగాణ మొదటిస్థానంలో ఉందన్నారు. బంగారు తెలంగాణలో మద్యం, డ్రగ్స్ఏరులై పారడం వల్ల మహిళలపై అత్యాచారాలు జరుగుతు న్నాయన్నారు.