Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రెటరీ జనరల్ నిర్మల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రెటరీ జనరల్ జి నిర్మల కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులపై పనిప్రదేశాల్లో వేధింపులను అరికట్టాలని కోరారు. బుధవారం హైదరాబాద్లోని ఆ సంఘం కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి చెందుతున్న ఈ సమయంలో చట్టసభల్లో తప్పకుండా మహిళలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరముందన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేస్తున్న దీక్షకు సంఘం పక్షాన పూర్తి మద్దతు ప్రకటించారు. శశి శ్రీ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు సమాజానికి ఎంతో చేటు చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చిలగాని సంపత్ కుమార స్వామి, కోశాధికారి గడ్డం బాలస్వామి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కనకరాజు, ఆ సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ సిహెచ్ రేణుకా దేవి, గ్రేటర్ అధ్యక్షులు కొంకటి మల్లేష్, గౌతం సత్యానంద చారి తదితరులు పాల్గొన్నారు.