Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన పలువురు మహిళా జర్నలిస్టులను డీజీపీ అంజనీ కుమార్ అభినందించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం డీజీపీ కార్యాలయంలో ఆయన మహిళా జర్నలిస్టులతో భేటీ అయ్యారు. అడిషనల్ డీజీలు మహేశ్ భగవత్, సంజరు కుమార్ జైన్, విజరు కుమార్, ఐజీలు చంద్రశేఖర్ రెడ్డి, తరుణ్ జోషి, డీఐజీ రమేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. పోలీస్‌శాఖలో ఇటీవల మహిళల నియామకాలు పెద్దఎత్తున జరుగుతున్నా యని చెప్పారు. పురుష పోలీస్ అధికారులతో పోటీపడి విధులు నిర్వర్తిస్తున్న మహిళా పోలీస్ అధికారులు అందిస్తున్న ఉత్తమ సేవలను మీడియా ద్వారా ప్రాచుర్యం కల్పించాలని కోరారు. ఈ సందర్బంగా పలువురు జర్నలిస్టులు, జర్నలిజంలో మహిళా జర్నలిస్టుల వర్కింగ్ విధానాలు, జెండర్ ఈక్వాలిటీ, వేధింపుల నిరోధానికి ఉన్న అంతర్గత కమిటీల పనితీరు తదితర అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సందర్బంగా కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ చేపట్టిన చర్యలను తెలియజేసే కాఫీ టేబుల్ బుక్‌ను జర్నలిస్టులకు డీజీపీ అంజనీకుమార్ బహూకరించారు.