Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లింగభేదం వద్దు...పిల్లల్ని సమానంగా చూడండి
- వీ-హబ్ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో మహిళా పారిశ్రామి కవేత్తల కోసం సింగిల్‌విండో విధానాన్ని ప్రత్యేకంగా తీసుకురానున్నట్టు పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. అవకాశాలు కల్పిస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలుగుతారని చెప్పారు. హైదరాబాద్‌లోని ఓ హౌటల్లో జరిగిన 'వి-హబ్' 5వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. లింగభేదం లేకుండా ఆడ, మగ పిల్లల్ని సమ దృష్టితో తల్లిదండ్రులు చూడాలన్నారు. తమ ఇంట్లో తన సోదరినీ, తనను అలాగే పెంచారనీ, తాను కూడా తన పిల్లల్ని అలాగే చూస్తున్నానని చెప్పారు. యువతరం ఎక్కువగా ఇంజినీర్, డాక్టర్, లాయర్ అవ్వాలని ఇంట్లో చెప్తారని, వ్యాపారవేత్తలు కావాలని ఎందుకు ప్రోత్సహించరని ప్రశ్నించారు. మానవ వనరులు, సాంకేతికతను వినియోగించుకుంటే అభివద్ధి సాధ్యమవు తుందన్నారు. దాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. వి-హబ్‌కు రూ.1.30కోట్లు ఇస్తే ఓ స్టార్టప్‌తో దాన్ని రూ.70కోట్లకు పెంచారని ప్రసంసించారు. మహిళలు బాధ్యతాయుతంగా, నిబద్ధతతో ముందుకెళ్తారనీ, అందువల్ల వారు ఏ రంగంలోనైనా రాణించగలరని అన్నారు. అమ్మాయిలు, అబ్బాయిలను సమానంగా చూసే అలవాటు మన ఇండ్ల నుంచే ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. తన తల్లిదండ్రులు తనను, చెల్లిని బాగా చదివించారనీ, తనకంటే ముందు తన సోదరి యూఎస్ వెళ్తానంటే పంపించారని తెలిపారు. పిల్లల పెంపకం అలాగే జరగాలని, వాళ్లు ఏరంగంలో ఆసక్తి కనబరిస్తే అటువైపే ప్రోత్సహించాలని చెప్పారు. కిందపడితే మేం ఉంటామనే ధైర్యాన్ని, నమ్మకాన్ని అమ్మాయిలైనా, అబ్బాయిలకైనా కల్పిస్తే కచ్చితంగా అభివద్ధి సాధిస్తారని తెలిపారు.