Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా ఉద్యోగులకు సన్మానం
నవతెలంగాణ-సిటీబ్యూరో
బ్యాంక్ ఆఫ్ బరోడా తెలంగాణ ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడు కలకు ఒలంపియాన్, అర్జున్ అవార్డు గ్రహిత జె.జె శోభ హాజరయ్యారు. తెలంగాణ సౌత్ రీజినల్ మేనే జర్ టీవీవీఎస్ శర్మతో కలిసి ఆమె జ్యోతి ప్రజల్వన చేశారు. కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాం క్షలు తెలియజేశారు. అనంతరం జె.జె శోభ మాట్లా డుతూ.. ఆ కాలంలో మహిళలు ఎక్కువగా ఇండ్లకే పరిమితం కావడంతోపాటు వారిపై ఆంక్షలు ఉండేవని, ఈతరం మహిళాలోకం ఉన్నత శిఖరాలను చేరుకోవడం హర్షించదగ్గ పరిణామమని అన్నారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుండటం సంతోషమన్నారు. కష్టప డితే ఫలితం కచ్చితంగా లభిస్తుందని చెప్పడానికి తన జీవితమే నిదర్శనమని చెప్పారు. కర్నాటకలోని ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన తాను ఎంతో కష్టపడి క్రీడల్లో రాణించి అర్జున్ అవార్డుతోపాటు ఎన్నో కీలక అవార్డులు సాధించడమే కాకుండా.. మంచి ఉద్యోగంలో కొనసాగుతున్నానని చెప్పారు. గృహిణిగా బాధ్యతల్ని నెరవేరుస్తూనే బీవోబీలో మహిళా ఉద్యోగినులు సమర్థవంతంగా విధులు నిర్వహించడం అభినంద నీయమని తెలిపారు. అలాగే ప్రతిరోజూ అరగంట పాటు వ్యాయామానికి సమయం కేటా యించేలా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. తెలంగాణ సౌత్ రీజినల్ మేనేజర్ టీవీవీఎస్ శర్మ మాటా ్లడుతూ.. దేశంలో వేల సంవత్సరాలుగా స్త్రీలను పూజించడం, గౌరవించడం జరుగుతోంద న్నారు. ప్రస్తుతం దేశ రాష్ట్రపతి, ఆర్థిక మంత్రి మహిళలే కావడంతోపాటు తమ బ్యాంకు బ్రాండ్ అంబాసిడర్‌గా మహిళలే కొనసాగుతుం డటం గర్వంగా ఉందన్నారు. తమ సంస్థలో మహిళా ఉద్యోగినులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని, వారికి నచ్చిన చోట పనిచేసే అవకాశం కల్పించడంతో పాటు మెటర్నిటీ లీవ్స్, ప్రెగెన్సీ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం ఇస్తున్నామన్నారు. వారి కోసం బ్యాంకు తరపున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. అనంతరం జె.జె. శోభకు బ్యాంకు తరపున మెమెంటో అందజేశారు. అలాగే, బ్యాంకు విధుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మహిళా ఉద్యోగులకు సర్ట్టిఫికెట్స్ అందజేశారు. వివిధ పోటీల్లో రాణించిన ఉద్యోగినులకు బహుమతులు అందజేసి సత్కరిం చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ రమేష్, ప్రోగ్రామ్ కో-ఆర్టినేటర్ భవాని, సీనియర్ మేనేజర్ మేరి సునంద, వివిధ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగినులు తదితరులు పాల్గొన్నారు.