Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఉమ్మడిరాష్ట్రంలో తొలగించిన 250 మంది హోంగార్డులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. బుధవారం ఈమేరకు సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్డర్ కాపీ లేదంటూ 250 మంది హోంగార్డులను విధుల్లో నుంచి తొలగించారని గుర్తు చేశారు. అప్పటికే పదేండ్లు వివిధ జిల్లాలో వారు విధులు నిర్వహించారనీ, అందుకు సంబంధించిన ఐడీకార్డ్సు, బ్యాంకు అకౌంట్స్, ఆరోగ్యకార్డులు ఉన్నాయని తెలిపారు.