Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బార్ లైసెన్స్‌లను రెన్యువల్ చేయనందున షాపు యజమానుల నుంచి రెన్యువల్ నిమిత్తం తీసుకున్న లక్ష రూపాయల డిపాజిట్ డబ్బును తిరిగి వారికి చెల్లించాలని ఎక్సైజ్ శాఖను హైకోర్టు ఆదేశించింది. దీనిపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ సమర్ధిస్తూ తీర్పు చెప్పింది. కోర్టుల్లో కేసుల కారణంగా వెలువడిన స్టే ఉత్తర్వుల ఫలితంగా షాపుల లైసెన్స్ రెన్యువల్ జరగలేదు. ఏడాదికి రెన్యువల్ గడువు కాబట్టి ఆ గడువు తీరినందున 60 షాపుల యజమానుల నుంచి రెన్యువల్ కోసం ఒక్కొక్కరి నుంచి తీసుకున్న రూ.లక్షను వాపస్ ఇచ్చేయాలని తీర్పు చెప్పింది.