Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కంఠేశ్వర్
ఈనెల 28-3-2023 నుండి పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో జాతీయ స్థాయి మహిళా ఫుట్ బాల్ టోర్నమెంటు నిర్వహణకోసం తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతినిద్యం వహిస్తున్న మహిళా ఫుట్బాల్ క్రీడా కారులకు కోచింగ్ నిర్వహణ నిజామాబాద్ పోలీస్ శాఖ సౌజన్యంతో నిర్వహిస్తున్న నేపద్యంలో నిజామాబాద్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆద్వర్యంలో గురువారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లోని ప్రశాంతి నిలయం యందు నిర్వహించారు. ముఖ్య అతిదులుగా నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు, ఐ.పి.ఎస్, పాల్గొన్నారు.ముందుగా మహిళా క్రీడాకారులకు కోచింగ్ క్యాంప్ ను ప్రారంభించి, అనంతరం క్రీడాకారులకు కిట్స్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ కె ఆర్ నాగరాజు మాట్లాడుతూ.. మన రాష్ట్రం నుండి వచ్చిన క్రీడాకారులకు మన నిజామాబాద్ లో కోచింగ్ క్యాంప్ నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయం అనియు . క్రీడా కారులు ఈ క్యాశీప్ ను చక్కగా సద్వినియోగం చేసుకోవాలని, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, వివిధ జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులకు తేది:9-3-2023 నుండి తేది:23-3-2023 వరకు ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈక్యాంప్ నిర్వహణ తర్వాత పంజాబ్ రాష్ట్రంలో నిర్వహించే జాతీయ స్థాయి క్రీడలలో తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసు కురావాలని, అక్కడ జరిగే క్రీడలలో అన్నిట్లో గెలువాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అదనపు డి.సి.పి (ఎ.ఆర్ ) గిరిరాజ్, ఎ.ఆర్ ఎ.సి.పి సంతోష్ కుమార్, డాపప కవితారెడ్డి జిల్లా ఫుట్ బాల్ వైస్ ప్రెసిడెంటు మసూద్ ఎజాజ్, ట్రెజరర్ మీర్ ఫారుఖ్ అలీ, సెక్రేటరి జావీద్, కోచ్ నాగరాజు, ఆర్.ఐలు, ఆర్.ఎస్.ఐలు క్రీడాకారులు పాల్గొన్నారు.