Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రమంత్రి రవిశంకర్ప్రసాద్పై వీహెచ్ ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీలో నక్సలైట్ భావాలున్నాయంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మాజీ ఎంపీ వి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని ఐక్యం చేసేందుకే కన్యకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించారని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. రాజీవ్‌గాంధీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు అందజేసిన నేపథ్యంలో ఆ విషయంపై తాను స్పందించబోనని స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీ సృజన చౌదరి లాంటి వారికి నోటీసులు ఇచ్చారనీ, ఆయన బీజేపీలో చేరగానే ఆకేసు ఏమైందో తెలియదన్నారు.రాజకీయాల కోసం బీజేపీ ఏమైనా చేస్తుందని ఎద్దేవా చేశారు.