Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎస్సీ కులస్తుడు కాదని చెప్పి ఆర్టీసీలో తొలగింపునకు గురైన కె.లక్ష్మీనారాయణ కులం ఏమిటో విచారణ చేయాలని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ అయితే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీని ఆదేశించింది. లక్ష్మీనారాయణ 1993లో ఎస్సీ రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగంలో చేరారు. ఎస్సీ కాదనే ఆరోపణలు వాస్తవం కాదని పదేండ్ల నాడు అధికారులు తేల్చారు. తర్వాత మళ్లీ అదే తరహా ఫిర్యాదు ఆధారంగా నాలుగేళ్ల క్రితం మిధాని డిపోలో చేస్తున్న ఉద్యోగం నుంచి తీసేయడంతో హైకోర్టును ఆశ్రయించారు. చీఫ్‌జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీల డివిజన్ బెంచ్ విచారించి రెండు నెలల్లోగా తిరిగి విచారణ పూర్తిచేసి లక్ష్మీనారాయణ ఎస్సీ అవునో కాదో తేల్చాలని ఆదేశించింది.