Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) డిమాండ్ చేసింది. గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కావలి అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శి కటకం రమేష్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వమున్న తెలంగాణలో బీఆర్ఎస్ సీపీఎస్ రద్దు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సీపీఎస్ అమలుకు ముందు ఎంపిక ప్రక్రియ పూర్తియి పోస్టింగ్ కోసం వేచిఉన్న డీఎస్సీ-2003 వారికి, వివిధ కారణాలతో ఆలస్యంగా పోస్టింగ్‌లు పొందిన డీఎస్సీ-2002 వారికి తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేస్తూ ఉత్తర్వులివ్వాలని డిమాండ్ చేశారు. పండితులు, పీఈటీల అప్‌గ్రెడేషన్‌పై కోర్టులో కేసు సత్వర పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. హామీ ఇచ్చిన ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేయాలని తెలిపారు. వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొన్నారు. పీఆర్సీ కమిటీని వేయాలనీ, జులై ఒకటి నుంచి ఐఆర్ ప్రకటించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను వెంటనే మంజూరు చేయాలని తెలిపారు.