Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొననున్న డీకే అరుణ, విజయశాంతి, మహిళా మోర్చా నాయకులు : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని మహిళలకు సీఎం కేసీఆర్ కుటుంబం చేస్తున్న అన్యాయాలనూ, మోసాలను ఎండగట్టడమే ధ్యేయంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం 'మహిళా గోస...బీజేపీ భరోసా' పేరుతో దీక్ష చేపట్టనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా సమావేశాన్ని నిర్వహించారు. దీక్షలో తమ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతి, మహిళా మోర్చా నాయకులంతా పాల్గొంటారని తెలిపారు.