Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళలకు అన్ని రంగాల్లో ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలి
- దేవాలయాల్లో సంకీర్తనలు, భజనకు అవకాశం కల్పించాలి : జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండూరి భాస్కర్
నవతెలంగాణ-కరీంనగర్
జానపద వృత్తి కళాకారులు అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో సంకీర్తనలు, భజనలకు వారికి అవకాశం కల్పించాలని జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండూరి భాస్కర్ ప్రభుత్వాన్ని కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో జానపద కళాకారుల సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మెన్ సర్దార్ రవీందర్ సింగ్ మహిళా కళాకారులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం కళాకారులను శాలువాలతో సత్క రించారు. ఈ సందర్భంగా కొండూరి భాస్కర్ మాట్లా డుతూ.. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో జాన పద కళాకారులకు సంకీర్తనలు, భజనలకు అవకాశం కల్పించాలని సంబంధిత శాఖ కమిషనర్‌కు ఎన్నిసా ర్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాల్లోని ఈవోలకు వినతి పత్రం ఇచ్చినా ప్రయోజనం శూన్యమని తెలిపారు. మరోవైపు మహిళలపై ఇటీవల తరచూ అఘాయి త్యాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు అని రంగాల్లో రాణించాలంటే ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు ఎంతో అవసరమని చెప్పారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తాళ్లపల్లి సంధ్య, కరీంనగర్ జిల్లా నాయ కులు రేణుక, కవిత, రజిత, సింగర్ సరిత, కోలాట గురువులు, ఒగ్గు కళాకారులు, మిమిక్రీ ఆర్టి స్టులు, డాన్స్ మాస్టర్లు, భరతనాట్యం, కూచిపూడి, జానపద శాస్త్రీయ సంగీత నృత్య కళాకారులు పాల్గొన్నారు.