Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
'జెనిసిస్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ భారత్ రాష్ట్ర సమితి (భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ నిర్థారణ) తొలి ఆంగ్ల పుస్తకాన్ని గురువారం ప్రగతి భవన్లో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. జాతీయ రాజకీయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఐదేండ్లుగా చేసిన మేధోమథనానికి దర్పణంగా సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు ఈ పుస్తకాన్ని రచించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ ప్రచురించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిరువురినీ అభినందించారు. 2018 మార్చి 3న ప్రగతిభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జాతీయ రాజకీయాల్లో రావాల్సిన గుణాత్మక మార్పు ఆవశ్యకతను వివరించారు. ఆ మార్పు కోసం ప్రజలు కోరుకుంటే తాను జాతీయ రాజకీయాల్లోకి వస్తానన్న చెప్పారు. అప్పటి నుంచి 2023 ఫిబ్రవరి 5న నాందేడ్‌లో జరిగిన బీఆర్ఎస్ సభ వరకు 35 వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. వర్తమాన జాతీయ రాజకీయాల గురించి పరిశోధనా దక్పథంతో అధ్యయనం చేసే వారికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని జూలూరి గౌరీశంకర్ చెప్పారు.