Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు 33 శాతం పదవులెందుకు ఇవ్వడంలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా గోస-బీజేపీ దీక్ష పేరుతో ఒక్కరోజు దీక్షను మహిళా మోర్చా నిర్వహించింది. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ..రాష్ట్రంలో మహిళలు, యువతులపై దాడులు జరిగితే కనీసం మాట్లాడని కవిత ఢిల్లీలో మహిళా బిల్లు కోసం దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు. లిక్కర్ దందాను పక్కదోవ పట్టించేందుకే ఈ డ్రామాలని విమర్శించారు. గురువారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్లో మహిళా బిల్లు, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల అంశంపై ఎందుకు చర్చించలేదని నిలదీశారు.