Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ది సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇన్‌క్లూజివ్ పాలసీ ఆధ్వర్యంలో భారతదేశంలో అసంఘటిత కార్మికులు: సమస్యలు మరియు సవాళ్లు అనే అంశంపై రెండు రోజులపాటు నిర్వహించిన జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఐసీఎస్ఎస్ఆర్-సౌత్ రీజియన్ సెంటర్ ఈ సమావేశానికి సహకరించాయి. సదస్సు కన్వీనర్ గా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జె రాణి రత్న ప్రభ వ్యవహరించారు. ''భారతదేశంలో అసంఘటిత కార్మికులు: సమస్యలు మరియు సవాళ్లు'' అనే పుస్తకాన్ని యుపీ కార్మికశాఖ వి.వి.గిరి లేబర్ ఇన్స్టిట్యూట్ డీజీ అమిత్ నిర్మల్ విడుదల చేశారు. రెండు రోజుల పాటు 11 టెక్నికల్ సెషన్లు, మూడు ప్యానెల్ చర్చలు జరిగాయి. సదస్సులో ప్రముఖ ప్రొఫెసర్లు అభిప్రాయాలను వెల్లడించారు. వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి దాదాపు వంద మంది పరిశోధకులు తమ పరిశోధక పత్రాలను సమర్పించారు.