Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీస్ కమిషనర్‌ను కోరిన టీఎస్‌పీజేఏ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విధినిర్వహణలో ఉన్న ఫోటో జర్నలిస్టు పరమేష్‌పై దాడి చేసిన పోలీసులు, భద్రత సిబ్బందిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణా రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు ఏ.గంగాధర్, ప్రధాన కార్యదర్శి కె.ఎన్.హరి హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్‌ను కోరారు. శుక్రవారంనాడు నూతన సచివాలయం బయటి నుంచి ఫోటోలు తీస్తున్న ప్రెస్ ఫోటోగ్రాఫర్పై పోలీసులు అకారణంగా దాడి చేశారని చెప్పారు. సచివాలయం ఫోటోలు తీయడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఫోటోగ్రాఫర్ పరమేష్‌ను పోలీసులు, భద్రతాసిబ్బంది చొక్కాలాగి, దౌర్జన్యంగా కెమెరా లాక్కునే ప్రయత్నం చేసి, దాడి చేశారని చెప్పారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామనీ, దీనికి కారణమైన పోలీసులు, భద్రతా సిబ్బందిపై కమిషనర్ చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.