Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రుద్రాంగిలో 39.5 డిగ్రీలు నమోదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చి ప్రథమార్ధంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువవుతున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాలో శుక్రవారం అత్యధికంగా 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈసాల తక్కళ్లపల్లి(పెద్దపల్లి)లో 39.4, మనాల్(రాజన్నసిరిసిల్ల)లో 39.2, వెల్గటూరు(జగిత్యాల) 38.9, జూలూరుపాడు (భద్రాద్రి కొత్తగూడెం)38.7, గుళ్లకోట(జగిత్యాల) 38.6, ఎండపల్లి(జగిత్యాల) 38.6, మండోర(నిజామాబాద్)38.5, నాయుడుపేట(భద్రాద్రి కొత్తగూడెం) 38.4, రాఘవపేట(జగిత్యాల) 38.3 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 15 నుంచి నాలుగైదు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గే అవకాశం ఉందనీ, అక్కడక్కడా వర్షం కూడా పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.