Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాన్ని ప్రతిఘటించాలి
- ప్రొఫెసర్ కంచ ఐలయ్య
నవతెలంగాణ-ముషీరాబాద్
శ్రమ జీవుల పోరాటాలను, సంస్కృతిని, వేల సంవత్సరాలుగా దేశనిర్మాణం కోసం చేసిన మహత్తర ప్రక్రియను సర్వనాశనం చేస్తున్న మనువాదాన్ని ప్రతిఘటించాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. సావిత్రి బాయి ఫూలే 126వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో స్వేచ్ఛ జేఏసీ అధ్వర్యంలో సావిత్రి బాయి యాదిలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, మతోన్మాదం, మనువాదాన్ని వ్యతిరేకిద్దాం అంటూ సాంస్కృతికోత్సవాలు ఆటపాట నిర్వహించారు. ఈ సందర్భంగా కంచ ఐలయ్య మాట్లాడుతూ.. విభిన్న సంస్కృతుల మధ్య జరుగుతున్న పొరాటలపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి పాటలు, నాటికలు, పాటలు రాయాలన్నారు. జేఏసీ కన్వీనర్ రమేష్ మాట్లాడుతూ.. మనువాదుల దాడులను ప్రతిఘటించడానికి, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాటానికి స్వేచ్ఛ జేఏసీ ఏర్పడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా కవి జయరాజ్, అరుణోదయ గాయకులు విమలక్క, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు, కళాకారులు మష్టార్జి, పులి కల్పన, భాస్కర్, స్వేచ్ఛ జేఏసీ భాగస్వామ్య సంస్థల నాయకులు కొల జనార్ధన్, జిడి సారయ్య, సంధ్య, ఝాన్సీ, వరలక్ష్మి, పి.శంకర్, తదితరులు ప్రసంగించారు.