Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లిక్కర్ స్కామ్లో విచారించనున్న అధికారులు
- మనీశ్ సిసోడియా, రామచంద్రపిళ్లై లతో కలిపి ప్రశ్నించే అవకాశం
- ఢిల్లీకి హుటాహుటిన వెళ్లిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-ప్రత్యేకప్రతినిధి
దేశంలో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత శనివారం ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఆమె వెళ్లనున్నట్టు సమాచారం. కాగా, ఈ స్కామ్లో హవాలా ద్వారా వంద కోట్ల రూపాయలు ఆప్ కీలక నేత మనీశ్ సిసోడియాకు చేరినట్టు వచ్చిన అభియోగాలపై కవితను ప్రశ్నించనున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ స్కామ్లో కవిత పాత్ర ఉన్నట్టుగా ఇప్పటికే అరెస్టైన ఆడిటర్ బుచ్చిబాబు, అభిషేక్ బోయిన్పల్లి, రామచంద్రపిళ్లైల నుంచి ఈడీ అధికారులు వాంగ్మూ లాన్ని సేకరించారు. కాగా, తాజాగా ఆప్ కీలక నేత మనీశ్ సిసోడియాను అరెస్టు చేసిన ఈడీ అధికారులు అతని రిమాండ్ రిపోర్టులో సైతం పలు మార్లు కవిత పేరును పేర్కొన్నారు. అలాగే ఈ కేసు తదుపరి విచారణ నిమిత్తం సిసోడియాను శుక్ర వారం నుంచి ఏడు రోజుల పాటు ఈడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే మరో నిందితుడు రామచంద్రపిళ్లైను కూడా ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకానున్న కవితను మనీశ్ సిసోడియా, రామచంద్రపిళ్లైలతో కలిపి ఈడీ అధికారులు విచారించే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. ముఖ్యంగా, హవాలా రూపంలో కవితతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, రామచంద్రపిళ్లైలతో కూడిన సిండికేటు ఆడిటర్ బుచ్చిబాబు ద్వారా హవాలా రూపంలో ఆప్ కీలక నేత మనీశ్ సిసోడియాకు లిక్కర్ పాలసీ మార్పునకు సంబంధించి అందజేసి నట్టుగా చెప్తున్న వంద కోట్ల రూపాయల గురించి ఈడీ నిశితంగా కవితను ప్రశ్నించే అవకాశాలు న్నాయని తెలుస్తు న్నది. ఇదిలా ఉంటే, కవితకు తాను బినామీనంటూ రామచంద్రపిళ్లై ఇదివరకు ఈడీ కిచ్చిన వాంగ్మూ లాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు అతని తరఫు న్యాయవాది ఈడీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేయడం ఈ కేసు మరోమలుపు తిరిగినట్ట య్యింది. దీనిపై సోమవారం కోర్టు విచారించ నున్నది. ఈ పరిస్థితు ల్లో ఈడీ అధికారుల ఎదుటకు విచారణ నిమిత్తం కవిత హాజరవుతుండటంతో బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్నది. మరోవైపు, కవిత సోదరుడు, రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల శాఖా మంత్రి కేటీఆర్ సైతం ఢిల్లీకి హుటాహుటిన శుక్రవారం బయలుదేరి వెళ్లారు. ఆయన రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది.