Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోమవారం పోలింగ్
- జోరుగా ప్రచారం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది. శనివారంతో ముగియనుంది. నియోజకవర్గంలో దాదాపు 29,749 వేల మందికిపైగా ఉపాధ్యాయులు తమ ఓటును నమోదు చేసుకున్నారు. సుమారు 137 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు 21 మంది అభ్యర్థులు బరి లో మిగిలారు. వచ్చే సోమవారం పోలింగ్ జరగనుంది. ఉదయం ఎని మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహిస్తారు. అలాగే 16న కౌంటింగ్ నిర్వహిస్తారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ ఈనెల 21తో ముగుస్తుంది. ఇప్పటికే అభ్యర్థులంతా జోరుగా ప్రచార కార్యక్ర మాలు నిర్వహిస్తున్నారు. తొలిదశలో పాఠశాలల్లో ప్రచారం నిర్వహించారు. మలిదశలో వ్యక్తిగతంగా ఇండ్లల్లోకి వెళ్లి ఓటర్లను కలిశారు. తుది దశలో ఆత్మీయ సమ్మేళనాలను చేపడుతున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల్లోనూ ఈ కార్యక్రమాలు వేగాన్నందుకున్నాయి. ఈ మారు పోటీ తీవ్రంగానే కనిపిస్తున్నది. మొత్తం 21 మంది అభ్యర్థుల్లో పోటీ ముగ్గురి మధ్యే ఉండే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు, ఉపాధ్యాయ నేతలు అభిప్రా యపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సమర్థిస్తూ వారి అడుగు లకు మడుగులొత్తే అభ్యర్థుల విషయంలో ఉపాధ్యాయ ఓటర్లు ఒకింత గుర్రుగా ఉన్నారనే ప్రచారమూ చోటుచేసుకుంటున్నది. దీంతో ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎన్నికల్లోఎవరికి పట్టం కట్టబోతున్నారనే అంశంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
మాణిక్రెడ్డివైపే చూపు..
దాదాపు 11 ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా దిగిన టీఎస్‌యూటీఎఫ్ నేత పాపన్నగారి మాణిక్‌రెడ్డి వైపు ఉపాధ్యాయ ఓటర్లు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం సాగుతున్నది. పోరాడే సంఘం నాయకుడిగా, ఉద్యమాలకు నాయకత్వం వహించిన నేతగా ఆయనకు మంచి పేరుందని ఆయా సంఘాల నాయకులు అభిప్రా యపడుతున్నారు. ఎన్నికల సంఘం మాణిక్‌రెడ్డికి బ్యాలెట్లో సీరియల్ నెంబరు 17ను కేటాయించిన విషయం విదితమే. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పి. జంగయ్య, చావ రవి, ఉపాధ్యక్షురాలు సిహెచ్.దుర్గాభవాని, కార్యదర్శులు వి. శాంతికుమారి, వై.జ్ఞానమంజరి, వి.నాగమణి, లక్ష్మారెడ్డి, రాములు తోపాటు సీనియర్ నేతలంతా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పాఠశా లలకు వెళ్లడం, వ్యక్తితగతంగా కలవడం ఎక్కువగా చేశారు. ఇతర అభ్యర్థు లు విందులు, వినోదాలతో ఉపాధ్యాయ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదనే వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం, గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన వారు, ఆ సంఘం నేతలు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషిచేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో టీఎస్‌యూటీఎఫ్ అభ్యర్థి పాపన్నగారి మాణిక్రెడ్డివైపు ఉపాధ్యాయులు దృష్టిసారించారని అంటున్నవారూ లేకపోలేదు.