Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సావిత్రీ బాబు పూలే వర్ధంతి సభలో జి. రాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సావిత్రిబాయిఫూలే ఆశయాల సాధనకు కృషి చేయాల్సిన అవసరం నేటి సమాజంలో మరింత పెరిగిందని తెలంగాణ ప్రజాసాంస్కృతిక కేంద్రం(టీపీఎస్కే) కన్వీనర్ జి రాములు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయిఫూలే వర్థంతిని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనువాదం మెజారిటీ ప్రజలకు చదువులు నిషేధించిందని గుర్తుచేశారు. నాగరిక సమాజానికి అక్షర దివిటి అందించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రి భాయి పూలే అని చెప్పారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ నాడు సావిత్రిబాయి పూలే అస్పృశ్యులు మహిళల చదువు పైన ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఆమె ఆశయాలకు తిలోదకాలిస్తూ నేటి కేంద్ర బీజేపీ సర్కార్ నూతన విద్యా విధానం పేరుతో దళితులు పేదలకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండి అబ్బాస్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే తన భర్త సహకారంతో దేశంలో మెజారిటీ ప్రజలకు అక్షర ఆయుధాన్ని అందించిన మొదటి వ్యక్తిగా నిలుస్తారన్నారు. మహిళా లోకానికి సావిత్రిబాయి పూలే ఒక స్ఫూర్తి శిఖరం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మోదుగు పూలు పత్రిక ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు, తెలంగాణ ప్రయివేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ ఏ విజరు కుమార్, వివిధ ప్రజా సంఘాలనాయకులు కొమ్ము విజయ్ కుమార్ ,జగదీష్ బాలరాజు, జానయ్య, రవి, కిషన్ ,తదితరులు పాల్గొన్నారు.