Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారత సమాజానికి సావిత్రిబాయి పూలే ఆదర్శమూర్తి అని ఎంసీపీఐ(యూ) అఖిల భారత ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని ఓంకార్ భవన్లో సావిత్రిబాయి పూలే 126వ వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మనువాదన్ని పెంచిపోషిస్తున్న బ్రాహ్మణిజానికి, ఆచారాలకు వ్యతిరేకంగా జ్యోతిరావు పూలే తెచ్చిన సంఘ సంస్కరణల అమలులో సావిత్రిబాయి పూలే పాత్ర గొప్పదన్నారు. మహిళలందరికీ విద్య అందాలనీ, మానవ వికాసం జరగాలని ఆమె తపించారని కొనియాడారు. భారత సమాజం మార్పు కోసం నడుం బిగించిందన్నారు. ఆమె స్ఫూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కుంభం సుకన్య పూల మాల వేశారు. కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఉపేందర్ రెడ్డి, వనం సుధాకర్, వరికుప్పల వెంకన్న, వస్కుల మట్టయ్య, వి. తుకారాం నాయక్, కన్నం వెంకన్న, పి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.