Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ మన్నె క్రిశాంక్
- బాధితులతో కలిసి కంటోన్మెంట్ బోర్డు ముందు ధర్నా
నవతెలంగాణ-కంటోన్మెంట్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఓట్లు పోగొట్టుకున్న వారితో కలిసి శుక్రవారం ఆయన బోర్డు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కంటోన్మెంట్ సూపరింటెండెంట్‌కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా క్రిశాంక్ మాట్లాడుతూ.. తొలగించిన 35,000 మంది ఓటు హక్కును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వారిని కేవలం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారని, కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలలో వారికి ఓటు హక్కు లేకుండా బోర్డు అధికారులు తొలగించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు హక్కును పునరుద్ధరించే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శామ్యూల్, మోని, రఘు, శ్రీను, ఫహీమ్, సాయి కిరణ్, త్రివేద్, సుశీల, భాగ్య తదితరులు పాల్గొన్నారు.