Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13 వరకు అరెస్టు చేయొద్దు:హైకోర్టు
నవతెలంగాణ-హైదరాబాద్
ఏపీకి చెందిన మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని సోమవారం వరకు అరెస్టు చేయడం, ఇతర కఠిన చర్యలు తీసుకోకూడదని సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారం వరకు అరెస్టు చేయొద్దని సీబీఐకి న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ విచారణకు హాజరైనప్పుడు చెప్పిన విషయాలను రికార్డింగ్ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలనీ, తనపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ అవినాశ్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన అత్యవసర లంచ్‌మోషన్ పిటిషన్‌ను శుక్రవారం విచారించింది. అవినాష్‌ను విచారించినప్పుడు సీబీఐ తీసిన వీడియో, వివేకా హత్య తర్వాత స్వాధీనం చేసుకున్న లేఖ దీనిపై సీఎఫ్ఎస్ఎల్ రిపోర్టులను సీల్డ్ కవర్లో అందజేయాలని ఆదేశించింది. విచారణకు హాజరైన సీబీఐ ఎస్పీ, విచారణను రికార్డింగ్ చేశామనీ, వాటిని హార్డ్‌డిస్క్‌లో తెచ్చామని చెప్పారు. సీబీఐ లాయర్ వాదిస్తూ, చట్ట ప్రకారమే అవినాష్‌ను విచారణ చేస్తున్నారని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా అవినాష్, అయన తండ్రి భాస్కర్‌రెడ్డిలను సీబీఐ అదుపులోకి తీసుకునే ఆస్కారం ఉందన్నారు. దీంతో హైకోర్టు, తదుపరి విచారణ జరిగే ఈ నెల 13వ తేదీ వరకు అవినాష్‌ను అరెస్టు చేయరాదని సీబీఐకి ఆదేశాలను జారీ చేసింది. సీఆర్పీసీలోని 161 సెక్షన్ ప్రకారం ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని అవినాష్ లాయర్ చెప్పారు. సీఆర్పీసీ 160 కింద నోటీసులిచ్చారనీ, తనను అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కూడా కోరారు. బలవంతపు చర్యలు చేపట్టకుండా చూడాలని కోరగా, అందుకు హైకోర్టు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సీబీఐ న్యాయవాది స్పందిస్తూ, అవినాష్‌ను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయనీ, అవినాష్‌తోపాటు ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని కూడా అదపులోకి తీసుకునే ఆవకాశముందని తెలిపారు. వాస్తవానికి ఈరోజే అదుపులోకి తీసుకోవాలని అనుకున్నామని చెప్పారు. అవినాష్‌ను అనుమానితుడు, నిందితుడిగా భావించాలని సీబీఐ నిర్ణయించిందన్నారు. వివేకా హత్య తర్వాత లభ్యమైన పత్రం, దానిపై ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు కూడా సీబీఐ వద్ద ఉన్నాయన్నారు.
అప్రూవర్‌గా మారిన దస్తగిరి చెప్పినట్లుగా సీబీఐ చేస్తోందని అవినాష్ న్యాయవాది ఆరోపించారు. దర్యాప్తు ఏకపక్షంగా ఉందన్నారు. ఆధారాలు లేకపోయినా కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందన్నారు. సీబీఐ విచారణను వీడియో తీయడం లేదన్నారు. చెప్పిన విషయాలను టైపింగ్ చేసేప్పుడు దర్యాప్తు అధికారి జోక్యం చేసుకుని పలుసార్లు కొన్నింటిని తీసేశారని చెప్పారు. దస్తగిరి కూడా నిందితుడని, ఈ విషయాన్ని వాచ్మెన్ రంగయ్య చెప్పారనీ, దీనికి విరుద్ధంగా సీబీఐ చర్యలు ఉన్నాయన్నారు. తమ కేసులో వివేకా కూతురు వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించవద్దని కోరారు. వివేకా కూతురు సునీత వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌పై సీబీఐ వైఖరి చెప్పాలని హైకోర్టు కోరింది. అవినాష్‌ను ఏహౌదాలో సీబీఐ విచారణ చేస్తోందని ప్రశ్నించింది. అనుమానితుడు, నిందితుడిగా విచారణ చేస్తున్నట్లు సీబీఐ జవాబు చెప్పింది.
వివేకా 2010లో షేక్ షమీమ్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు., వాళ్లకు 2015లో కొడుకు పుట్టాడు. ఆస్తికి వారసుల వివాదం వచ్చింది. అప్పటి నుంచే వివేకా భార్య, కుమార్తె హైదరాబాద్‌లో వివేకాకు దూరంగా ఉంటున్నారు. వివేకా హత్య తర్వాత తమ కుటుంబాన్ని బెదిరించినట్లుగా షమీమ్ సీబీఐకి చెప్పింది. వివేకా హత్య తర్వాత సునీత తన భర్త రాజశేఖర్‌రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ ఎం.రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి)ని కలిశారు. తర్వాత టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని కూడా కలిశారు. వివేకా హత్య వెనుక బీటెక్ రవి, చంద్రబాబు పాత్ర ఉంది. అని అవినాష్ పిటిషన్లో పేర్కొన్నారు.