Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈనెల 13వ తేదీ వచ్చినా ఇంకా ఆరు జిల్లాల ఉద్యోగులకు ఫిబ్రవరి వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్లు జమకాలేదనీ, వెంటనే జమ చేయాలనీ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మోడల్ స్కూల్, కేజీబీవీ ఉద్యోగుల వేతనాలను ఇంకా చెల్లించలేదని తెలిపారు. గత మూడు నెలలుగా ఎయిడెడ్ టీచర్లకు జీతాల్లేవని పేర్కొన్నారు. జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు, రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ స్కూళ్లు, కేజీబీవీ సిబ్బందికి వేతనాలు జమకాలేదని తెలిపారు. గత ఐదు నెలలుగా పీఆర్సీ బకాయిలు, ఇతర సప్లిమెంటరీ బిల్లు లు ఏవీ మంజూరు కావడం లేదని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు కొచ్చినందున రాష్ట్ర ప్రభుత్వం తక్ష ణమే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న వేత నాలు, బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
ప్రలోభాలకు గురిచేస్తున్న అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలి
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఉపాధ్యాయులకు నగదు, మద్యం పంపిణీ చేస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్న అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌కు ఆదివారం టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి ఫిర్యాదు చేశారు. బీజేపీ, పీఆర్టీయూటీఎస్ అభ్యర్థుల పక్షాన వారి మనుషులు ఓటర్లకు మద్యం బాటిళ్లు, రూ.రెండు వేల నుంచి రూ.ఐదు వేల వరకు నగదు బదిలీ చేస్తూ ఓట్లు వేయాలంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని తెలిపారు. కేజీబీవీ, గురుకులాల ఉపాధ్యా యులకు ఇరువురు అభ్యర్థులు నగదు పంపిణీ చేయబోగా పలువురు ఉపాధ్యా యులు తిరస్కరిం చారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను ప్రలోభాలకు గురి చేస్తూ నైతికంగా దిగజార్చుతున్న అభ్యర్థులను ఓడించటం ద్వారా వారికి తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు.