Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం సలహామండలి కన్వీనర్‌గా డాక్టర్ సి. మృణాళిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆమె వృత్తిరీత్యా అధ్యాపకురాలు. వివిధ అంశాలపై 20 పుస్తకాలను రచించారు. షార్ట్ స్టోరీలు, సామాజిక అంశాలు, నవలలు రాశారు. వివిధ దేశాల్లో సాహిత్య సదస్సుల్లో ప్రసంగించారు. కోమలి గాంధారం, ఇంతిహాసం వంటి వ్యంగ్యంతో పాఠకుల మీద తమదైన ముద్రవేశారు. అరుదైన అనువాదాలు, ఆంగ్లసాహిత్యంలో లోతైన అవగాహనతో తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగానికి తొలి మహిళ మృణాళిని కావడం పట్ల పలువురు కవులు, రచయితలు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ సాహితి అభినందనలు
కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం సలహా మండలి కన్వీనర్‌గా డాక్టర్ మృణాళిని ఎంపిక కావడం పట్ల తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వల్లభపురం జనార్ధన, సి. ఆనందాచారి ఆమెకు అభినందనలు తెలిపారు.