Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్దపల్లి జిల్లాలో నిరసన
నవతెలంగాణ - ఓదెల
నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో కనగర్తి గ్రామపంచాయతీ సిబ్బంది బిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ.. నిత్యం గ్రామాన్ని శుభ్రపరుస్తూ స్వచ్ఛతకు పాడుతున్నామన్నారు. అయినా తమ బతుకులు మాత్రం మారడం లేదని వాపోయారు. వచ్చే తక్కువ వేతనం కూడా నాలుగు నెలలుగా రావడం లేదని తెలిపారు. దాంతో పిల్లల చదువులకు ఫీజులు కట్టలేక, నిత్యావసర వస్తువులు కొనుక్కునే స్థితి లేక గ్రామంలో వీధి వీధి తిరుగుతూ బిక్షాటన చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, మల్టీపర్పస్ను రద్దు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశాారు. కార్యక్రమంలో సిహెచ్.ప్రభాకర్, శనిగరపు బాపు, పైడిపల్లి నాగయ్య, పైడిపల్లి స్వప్న, తాళ్లపల్లి శంకర్, రమేష్, తదితరులు ఉన్నారు.