Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనువాద భావాలకనుగుణంగా సిలబస్ రూపకల్పన
- గాంధీ, అంబేద్కర్, భగత్‌సింగ్ చరిత్ర తొలగింపు
- ఆర్ఎస్ఎస్ నాయకుల గురించి పాఠ్యాంశాలు
- హిందీని బలవంతంగా రుద్దుతున్న వైనం
- ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్రాల హక్కులకు భంగం
- తిరోగమన దిశలో జాతీయ విద్యావిధానం
- ఆరేండ్లు నిండితేనే ఒకటో తరగతిలో ప్రవేశం నిబంధన
- పేద పిల్లలు చదువుకు దూరమయ్యే ప్రమాదం
- విద్యాకార్పొరేటీకరణకు మోడీ సర్కారు కుట్ర
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం-2020ని రాష్ట్రాలను సంప్రదించకుండానే ఏకపక్షంగా తెచ్చింది. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం విద్యను తన చేతుల్లోకి తీసుకుంటున్నది. రాష్ట్రాల హక్కులను హరిస్తూ విద్యావిధానాన్ని రూపొందించింది. విద్యాకేంద్రీకరణకు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. విద్యారంగంలో తిరోగమన విధానాలను అవలంభిస్తున్నది. మనువాద భావజాలాన్ని విద్యారంగంలో చొప్పిస్తున్నది. అందుకనుగుణంగా సిలబస్‌ను రూపకల్పన చేస్తున్నది. భగవద్గీతను చదవాలంటూ పాఠ్యాంశాల్లో చేర్చుతున్నది. యూజీసీ, ఏఐసీటీఈతోపాటు ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వారినే చైర్మెన్, వీసీలుగా నియమిస్తున్నారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్, భగత్‌సింగ్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను పాఠ్యాంశాల నుంచి తొలగిస్తున్నది. ఆర్ఎస్ఎస్ నాయకులైన హెడ్గేవార్, వీడి సావర్కర్ వంటి వారి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి విద్యార్థులకు బోధిస్తున్నది. చరిత్రను వక్రీకరిస్తున్నది.
బొల్లె జగదీశ్వర్
మత ఉన్మాదాన్ని, హిందూత్వ భావజాలాన్ని విద్యార్థుల మెదళ్లల్లోకి తీసుకెళ్తున్నది. తిరోగమన దిశలో నూతన జాతీయ విద్యావిధానాన్ని మోడీ ప్రభుత్వం రూపొందిం చింది. విద్యా ప్రయివేటీకరణ, వ్యాపారీక రణ, కార్పొరేటీకరణ కోసమే ఇది దోహదపడుతుంది. విద్యారం గంపై కేంద్ర ప్రభుత్వం బుల్డో జర్ను ప్రయోగిస్తున్నది. ఇది పేద విద్యా ర్థులు, ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. అందుకే నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలంటూ అభ్యుదయ వాదులు, ప్రజాతంత్రవాదు లు, విద్యార్థి, ఉపా ధ్యాయ, అధ్యాపక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శాస్త్రీయ విద్యావిధానం కావాలంటూ కోరుతున్నాయి.
విద్యాహక్కు చట్టంలోని ముఖ్యాంశాలు
దేశంలోని ఆరు నుంచి 14 ఏండ్ల వయస్సుగల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడమే ఈ చట్టం ఉద్దేశం. భారత రాజ్యాంగంలోని 86వ సవరణ ద్వారా ఆర్టికల్ 21(ఏ) ప్రకారం ప్రతి విద్యార్థికి విద్య ప్రాథమిక హక్కుగా యూపీఏ ప్రభుత్వం కల్పించింది. దాన్ని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తున్నది. అందరికీ విద్య అందించాలన్న బాధ్యత నుంచి తప్పుకుంటున్నది. అందులో భాగంగానే ఆరేండ్లు నిండిన వారికే ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించాలన్న నిబంధనను తెచ్చింది. దీని వల్ల పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. ఒక ఏడాది చదువును కోల్పోయే అవకాశమున్నది.
ఎన్ఈపీతో ప్రమాదం
ఐదేండ్లు నిండిన విద్యార్థులకే ప్రస్తుతం రాష్ట్రంలో ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా కేంద్రం ఎన్ఈపీ పేరుతో ఆరేండ్లు నిండిన విద్యార్థులకే ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించాలని ఆదేశించింది. ఈ నిర్ణయం ప్రభుత్వ పాఠశాలలకు గొడ్డలిపెట్టుగా మారనుంది. సర్కారు బడుల్లో ప్రీప్రైమరీ తరగతుల్లేవు. దీంతో ఏడేండ్లు వచ్చేదాకా తల్లిదండ్రులు ఎవరూ వారి పిల్లలను బడికి పంపించకుండా ఉండే పరిస్థితి లేదు. ఇంకోవైపు ప్రయివేటు పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులున్నాయి. దీంతో అనివార్యంగా ప్రయివేటు విద్యాసంస్థల్లోనే విద్యార్థులు చేరతారు. విద్యాప్రయివేటీకరణ, కార్పొరేటీకరణను ప్రోత్సహించడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని విద్యావేత్తలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులు చేరడం లేదనే కారణంతో ప్రభుత్వ బడుల మూసివేతకు ఇది దారితీసే ప్రమాదమున్నది.
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
రాజ్యాంగ అంశాలైన సామ్యవాదం, ప్రజా స్వామ్యం, లౌకికతత్వం, ఫెడరల్ స్వభావానికి విరుద్ధంగా జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. విద్యారం గంపై రాష్ట్రాలకుండే హక్కులు, స్వయం ప్రతిపత్తిని కోల్పోయే ప్రమాదమున్నది. ఫెడరల్ స్ఫూర్తికి కేంద్రం భంగం కలిగిస్తున్నది. శాస్త్రీయ దృక్పథాన్ని విద్యార్థుల్లో పెంపొందించేలా లేదు. మూఢవిశ్వాసాలు, మత భావాలను ముఖ్యంగా మనువాద భావజాలాన్ని రుద్దేలా ఉన్నది. ప్రస్తుతం మాతృభాషతో పాటు ఇంగ్లీష్, హిందీ భాషలు అమలవుతున్నాయి. కానీ ఎన్ఈపీలో సంస్కృతం, హిందీని బలవంతంగా అమలు చేసే ప్రమాదమున్నది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఆధునిక యుగంలో సంస్కృతం, హిందీ భాషలను నేర్చుకుని విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడతారా?అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించకుండా యంత్రాలుగా తయారు చేసే విద్యావిధానాన్ని రూపొందించిందన్న అభిప్రాయమున్నది.
జాతీయ విద్యావిధానం సిఫారసులు
దేశంలో 10+2+3 అమల్లో ఉన్న పాఠ్య ప్రణాళిక బోధనా నిర్మాణాన్ని 5+3+3+4గా మార్చా లని ప్రతిపాదించింది. ప్రీ స్కూల్ నుంచి 12వ గ్రేడ్ (తరగతి) (3 నుంచి 18 ఏండ్ల) వరకు ఉచిత నిర్బంధ విద్య అందు బాటుకు హామీనివ్వడానికి విద్యాహక్కు చట్టాన్ని విస్తరింప జేస్తామని ప్రకటించింది. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఒకటి నుంచి 12వ తరగతి వరకు సిలబస్‌ను ఎన్సీఈఆర్టీ రూపొందిస్తుందని ప్రకటిం చింది. రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ (ఆర్ఎస్ఏ) లేదా జాతీయ విద్యాసంఘం ప్రధాని అధ్యక్షతన ఏర్పాటవు తుందని తెలిపింది. పదేండ్ల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై పెట్టు బడులను 20 శాతానికి పెంచాలని సూచించింది.
అందరికీ శాస్త్రీయ విద్య అవసరం
నూతన జాతీయ విద్యావిధానం పేరుతో ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో ఉన్న సరస్వతి శిశుమందిర్ సంస్కృతికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. అందులో భాగంగానే సంస్కృతం భాషను ప్రోత్సహిస్తున్నది. దేశంలో సరస్వతి శిశు మందిర్‌లకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబులిటీ (సీఎస్ఆర్) నిధులను విరాళాల రూపంలో పెద్దమొత్తంలో వెళ్తున్నట్టుగా తెలుస్తున్నది. శాస్త్రీయ ఆలోచనలకు పదును పెట్టేలా ఈ విద్యావిధానం లేదని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, మనువాదాన్ని సిలబస్‌లో పొందుపరిచే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామన్ స్కూల్ విధానం అమలు చేయడం, అందరిలోనూ శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడం, ప్రయివేటు విద్యారంగాన్ని బలహీనం చేయడం, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడమే పరిష్కారమని సూచిస్తున్నారు.
కొఠారి కమిషన్ సిఫారసులు
విద్యారంగానికి జాతీయ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఆరు శాతానికి తగ్గకుండా నిధులు కేటాయిం చాలని సూచించింది. కేంద్ర బడ్జెట్లో పది శాతం, రాష్ట్రాల బడ్జెట్లో 30 శాతం నిధులు విద్యకు కేటాయిం చాలని సిఫారసు చేసింది. కామన్ స్కూల్ విధానం ఉండాలని తెలిపింది. 10+2+3 విద్యా విధానం అమలు చేయాలని కోరింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఇదే విధానం అమల్లోకొచ్చింది.